గోళ్లపాడు చానల్‌లో జరిగింది అవినీతి కాదు.. అభివృద్ధి : పువ్వాడ

-

ఖమ్మం నగరంలోని త్రీటౌన్‌ పరిధిలో గల గోళ్లపాడు చానల్‌లో అవినీతి జరిగిందంటున్న మీరు ఇన్నేళ్లు నోరెందుకు మూసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినందున అవినీతి జరిగిందంటున్నారు. దమ్ముంటే నిరూపించాలి. గోళ్లపాడు చానల్‌లో జరిగింది అవినీతి కాదు. అభివృద్ధి అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రతిపక్షాలపై ఫైర్‌ అయ్యారు. అభివృద్ధి జరిగిందని ఒప్పుకోవడానికి మనసు రాక ఇలా నిందలు వేస్తూ అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. ఖమ్మం నగరం 28వ డివిజన్‌ ప్రకాశ్‌ నగర్‌లో కోడి లింగయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొని ప్రసంగించారు. నాడు జై తెలంగాణ అంటే కన్నెర్రజేసి ఉద్యమకారులపై లాఠీ దెబ్బల వర్షం కురిపించిన ఘనత కాంగ్రెస్‌ నాయకులదని అన్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఓట్లు దండుకునేందుకు ఇళ్లలో జొరబడి బలవంతంగా కండువాలు కప్పి.. ఫొటోలు వాట్సాప్‌లలో పెట్టి మద్దతు తెలిపిండని అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు.

ఇది ఇలా ఉంటె, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ తరుణంలో ఖమ్మం రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓ వైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు.. ప్రచారంలో దూసుకెళ్తూ.. పువ్వాడ అనుచరులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై మావోయిస్టులు లేఖ విడుదల చేయడం సంచలనంగా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version