బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయకుండా కేంద్రం కుట్ర : మంత్రి పువ్వాడ

-

కేంద్రం ప్రభుత్వం బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరోసారి మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ గురించి మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెనుక కుట్ర జరుగుతోందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనులను కేంద్ర ప్రభుత్వం అదానీ పరం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ శాసన సభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పువ్వాడ అజయ్ మాట్లాడారు.

‘‘’విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు క్యాప్టివ్‌ గనులు లేకుండా చేసి దాన్ని మూసివేసేందుకు యత్నిస్తున్నారు. బైలదిల్లా నుంచి ఐరన్‌ ఓర్‌ను ముంద్రాకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారు. ఆ గనులను బయ్యారానికి కేటాయించకుండా గుజరాత్‌కు తరలిస్తున్నారు. అదానీ కోసమే బైలదిల్లా నుంచి 1800కి.మీ.దూరంలోని ముంద్రాకు తరలిస్తున్నారు. బయ్యారంలో ఎప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరగకుండా కుట్ర జరుగుతోంది. అక్కడ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాం. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ముందుకొస్తే మౌలిక వసతుల్లో 50 శాతం ఖర్చు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’’ అని పువ్వాడ అజయ్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version