సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..

-

సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవ్వడం సర్వసాదారణం అయ్యింది..సోషల్ మీడియా ప్లాట్ఫాంలు వినియోగదారులను దీని గురించి ఎంత హెచ్చరిస్తున్నా హ్యాకింగ్స్ మాత్రం ఆగడం లేదు..కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన సోషల్ మీడియా ప్లాట్ఫాం హ్యాక్ కాకుండా కాపాడుకోవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హ్యాకింగ్ కు ముఖ్యమైన పాస్వర్డ్..సులువుగా ఉండే పాస్వర్డ్ ను ఉపయోగించడం ద్వారా ఈజీగా హ్యాక్ అవుతుంది..క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నంబర్స్, సింబల్స్ అన్నీ ఉపయోగించి కనీసం 18 అక్షరాల పాస్వర్డ్ను సృష్టించండి..

టూ-ఫాక్టర్ అథెంటికేషన్ మీ ఖాతాకు అదనపు భద్రతను జోడిస్తుంది. 2FAని ఆన్ చేసిన తర్వాత, మీ ఖాతాను యాక్సెస్ చేయాలంటే హ్యాకర్లకు మీ ఫోన్ లేదా ఇమెయిల్కి వచ్చే కోడ్ కూడా అవసరం. ఇప్పుడు హ్యాకర్కు కోడ్ రాకపోతే అతను ఖచ్చితంగా మీ ఖాతాను యాక్సెస్ చేయలేరు..

*. ఇప్పటి వరకు మనం ఆన్లైన్ సేఫ్టీ గురించి మాట్లాడాం. అయితే ఇది సెక్యూరిటీకి సంబంధించినది. ఈ విషయంలో మీరు మాత్రమే ఈ జాగ్రత్త తీసుకోవాలి.

*. వాస్తవానికి ఫిషింగ్ స్కామ్లు లాగిన్ డిటైల్స్ దొంగిలించడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక సాధారణ పద్ధతి. మీరు ఎల్లప్పుడూ తెలియని లింక్లు, ఈమెయిల్లు లేదా మెసేజ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున కూడా తెలియని లింక్పై క్లిక్ చేయవద్దు..

*. ఏదైనా సోషల్ మీడియా కొత్త అప్డేట్ను కంపెనీ విడుదల చేసినట్లయితే, మీరు కచ్చితంగా దానికి సంబంధించిన లేటెస్ట్ వెర్షన్ను ఉపయోగించాలి. అప్డేట్స్ ద్వారా కంపెనీ అనేక భద్రతా బగ్లను పరిష్కరిస్తుంది..

*. మీ డివైస్ను పబ్లిక్ వైఫై నెట్వర్క్కు కనెక్ట్ చేయడం ద్వారా, దానిని సులభంగా హ్యాక్ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో పబ్లిక్ వై-ఫై ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. బదులుగా సురక్షితమైన, వ్యక్తిగత వైఫై నెట్వర్క్ లేదా మొబైల్ డేటా కనెక్షన్ని ఉపయోగించండి..

*. స్క్రీన్ ను మూడు గంటల కంటే ఎక్కువగా సేపు చూస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version