చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మరు : మంత్రి రోజా

-

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఏపీ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. అయితే.. టీడీపీ సానుభూతిపరులు చంద్రబాబు అరెస్టును ఖండిస్తుంటే.. మరోవైపు విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. కసాయిని గొర్రె నమ్ముతుందేమో కానీ ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును మాత్రం నమ్మరని అన్నారు మంత్రి రోజా.

మహిళా సాధికారతపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… వాలంటీర్ వ్యవస్థతో మహిళలకు జగన్ అనేక పథకాలు తీసుకు వచ్చారన్నారు. ఆడపిల్లల కష్టాలు జగన్‌కు తెలుసునన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారని చెప్పారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని, ఆయనది బోగస్ ఆలోచన అన్నారు. చంద్రబాబు చీటర్ అయితే, జగన్ లీడర్ అని మంత్రి రోజా అన్నారు.

అరెస్ట్ చేస్తారని ఢిల్లీలో దాక్కున్న లోకేశ్‌కు, జైల్లో ఉన్న చంద్రబాబుకు, అసెంబ్లీలో తొడగొట్టిన బాలకృష్ణకు ఒకటే చెబుతున్నానని, జగన్ ఈ నాలుగేళ్లలో అమలు చేసిన పథకాలు 14 ఏళ్ళు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా చేశారా? అని ప్రశ్నించారు. పసుపు జెండా , ఎర్రజెండా లేదా ఏ జెండా పట్టుకున్న వారైనా జగన్‌లా మహిళా అజెండాతో పనిచేసే వారిని చూపించాలని సవాల్ చేశారు. ప్రతిపక్ష టీడీపీ పనికిరాని పార్టీ అన్నారు.

జగన్‌ను ఇంటికి పంపిస్తామన్న వ్యక్తి జైలుకు వెళ్లాడని, భయం ఎలా ఉంటుందో జగన్‌కు పరిచయం చేస్తానని చెప్పిన లోకేశ్ భయపడి ఢిల్లీకి పారిపోయాడని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఇంటికి పంపించడం, పార్టీ లేకుండా చేయడం వారి వల్ల కాదన్నారు. జగనన్నకు ఒంట్లో భయముండదు.. ఒంట్లో బెదురుండదు… మిమ్మల్ని కొట్టే దాంట్లో (ఎన్నికల్లో ఓడించడం) తిరుగుండదు.. అర్థమైందా రాజా! అని రజనీకాంత్ సినిమా డైలాగ్ చెప్పారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేశ్ కలిసినా, ట్వంటి24లో జగనన్న వన్స్ మోర్.. టీడీపీ నో మోర్, జనసేన పరార్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version