మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది: రోజా

-

నందమూరి, నారా కుటుంబ సభ్యులపై నువ్వా విమర్శించేది అంటూ బండారు సత్యనారాయణమూర్తి విరుచుకుపడ్డారు. నీ గత జీవితం ఇది అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. నువ్వు నటించిన వీడియోలు తమ వద్ద ఉన్నాయంటూ హెచ్చరికలకు దిగారు. దగ్గరే ఉండి ప్రోత్సహిస్తున్నారని సీఎం జగన్ పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర మహిళా కమిషన్ కలుగజేసుకొని బిజెపికి లేఖ రాయడంతో… పోలీసులు బండారు సత్యనారాయణమూర్తి పై కేసులు నమోదు చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి రోజాకు అండగా వైసీపీ నేతలు నిలవలేకపోయారని విమర్శలు వచ్చాయి.

తాను టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వేధిస్తున్నారని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ‘బ్లూ ఫిల్మ్ లో నటించింది.. బ్లూ ఫిల్స్లో నటించింది అంటూ టార్చర్ చేస్తున్నారు. అసెంబ్లీలో సీడీలను కూడా చూపించారు. కానీ ఎప్పుడూ నిరూపించలేదు. మహిళలు నచ్చినట్లు బతకమని సుప్రీంకోర్టే చెప్పింది. మీరెవరు నా క్యారెక్టర్ను జడ్జ్ చేయడానికి. మహిళల్ని టీడీపీ ఆట వస్తువుల్లా చూస్తోంది’ అని రోజా భావోద్వేగానికి గురయ్యారు. మహిళలు ఎంత ఎదిగినా.. బండారు సత్యనారాయణమూర్తి వంటి కొంతమంది పురుషుల ఆలోచన ధోరణి మారట్లేదు. నా క్యారెక్టర్ ను ప్రశ్నించారు. ఇలాంటి వారి వల్ల ఆడపిల్లలు వారి కలలను సాకారం చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటారు ” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజెన్లు విభిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version