మానవత్వం చాటుకున్న మంత్రి.. ఏం జ‌రిగిందంటే..

-

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి. వివ‌రాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లాలోని ముడిమ్యాలకు సమీపంలోని దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింలు అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అతడు గాయపడి రోడ్డుపై పడిపోయాడు.

సొంతూరు కౌకుంట్ల నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మంత్రి సబిత ప్రమాద విషయా న్ని గమనించి తన కాన్వాయ్‌ను ఆపి వ్యక్తి ని 108లోకి ఎక్కించారు. దామరగిద్ద సర్పంచ్‌కు సమాచారం అందించారు. బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి చెప్పారు. ఆపదలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న మంత్రి సబిత చొరవను ప్ర‌జ‌లు ప్రశంసించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version