శంభాజీ సినిమా పై మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..!

-

శంభాజీ సినిమా వీక్షించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఏడున్నర ఏళ్ళ తరువాత సినిమా చూసాను. ఒక వీరుడి సినిమా చూసాననే ఆనందం ఉంది.. ఒక వీరుడి ముగింపు అలా జరిగినందుకు వేదన ఉంది అని తెలిపారు. ఛత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్ లను మొదటి స్వాతంత్ర్య యోధులుగా చెప్పాలి. అలాంటి వారి చరిత్ర సినిమాగా తీసినందుకు దర్శక నిర్మాత లను అభినందిస్తున్నా. సమకాలీన చరిత్రకారుల పైన సినిమా తీయాలి. వ్యాపారం కోసం స్మగ్లర్లను హీరోలుగా చూపించే విధానం సరికాదు,. హీరోలు గంజా, డ్రగ్స్ తీసుకునేవి చూపించకూడదు.

వీరసావర్కర్ వర్ధంతి సందర్భంగా మరొక వీరుని సినిమా చూసాను. సూరత్ నుంచీ తంజావూరు వరకూ హిందూ సామ్రాజ్యం నెలకొల్పాడు శంభాజీ. మన దేశానికి వలస పాలకులను గొప్ప హీరోలుగా చరిత్రకారులు సృష్టించారు. 60 ఏళ్ళకు పైగా ఏలిన పార్టి మనకు మొఘలులు గొప్పవారనే భావన కలిగించారు. తల్లి తండ్రి సోదరులను చంపిన వారిని గొప్పవారుగా ఆ పార్టీ చూపించింది. తండ్రిని కారాగారానికి పంపి చంపిన చరిత్ర హీనుడి గురించి గొప్పగా ఆ పార్టీ చెప్పింది. శంభాజీ, శివాజీ లాంటి వారి చరిత్ర మనం చదువుకోవాలి అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version