విజయనగరం.. గరివిడి మండలం శివరాం గ్రామంలో రెండు పులి పిల్లలు కలకలం రేపాయి. తన జొన్న తోటలో నుండి పులి పిల్లలు వెళ్తుండగా చూసిన రైతు భయంతో పరుగులు పెట్టాడు. అనంతరం ఈ విషయం గ్రామంలో తెలియగ.. అటవిశాఖాధికారులకు ఫిర్యాదు చేసారు గ్రామస్థులు. పులి పిల్లల అడుగుజాడలు పరిశీలించిన అటవీశాఖాధికారులు.. అవి పులి పిల్లలు కాదని, హైనా పిల్లలు లేక అడవి పిల్లులని చెప్పి గ్రామస్థులను శాంతపరిచారు అధికారులు.
అయితే అవి ఏంటనేది క్లారిటీగా చెప్పలేకపోతున్నారు అటవిశాఖ అధికారులు. కానీ అవి ఏమైనా.. ఇలా ఉన్నటుండి గ్రామం వైపు ఎందుకు వచ్చాయి అని ఆరా తీస్తున్నారు అధికారులు. అలాగే అవి ఒకవేళ పులి పిల్లలే అయితే.. వారి తల్లి కూడా చుట్టూ పక్కలే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. తప్పిపోయిన పిల్లలను వెతుకుంటూ పులి గ్రామంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది అని.. గ్రామస్థులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు.