తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సామంచి శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వై సిపి పాలన లో రాష్ట్రం మొత్తం 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అమరావతి రాజధాని లేకుండా చేయడానికి మూడు రాజధానులు ప్రకటించి ప్రజలను మోసం చేశారు . గత 7 నెలల్లో రాష్ట్ర పాలన మొత్తం గాడిలోకి తెచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చేసినా తప్పులు అంతా చేసి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఏమి తప్పు చేయని వ్యక్తిగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.
జిల్లా లో పాడి రైతులు పాలు అమ్మాలంటే పెద్దిరెడ్డి వర్గం నిర్ణయించిన రేటు కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. జిల్లాలో ఎక్కడ స్థలాలని లేకుండా చేసిన ఘనత పెద్దిరెడ్డిదే. దోచుకున్నారు కాబట్టి వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. భవిష్యత్తులో మళ్ళీ ఈ పార్టీ నీ గెలిపిస్తే ఇంటికి,మీకు, మీ ఇంట్లో పుట్టిన బిడ్డకు కూడా జగన్ అని పేరు పెట్టాలని ఆంక్షలు పెడతారు. ఆడపిల్లా పుడితే భారతీ అని పెట్టాలని అంటారు.. ఇంతటి అవినీతి కలిగిన పార్టీ దేశంలోనే లేదు పెద్దిరెడ్డి అవినీతి కి శిక్ష తప్పదు అని మంత్రి సత్య కుమార్ అన్నారు.