బ్రేకింగ్ : మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ కి తప్పిన ప్రమాదం

-

 

బ్రేకింగ్ : మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్ కి భారీ ప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌ లోని ఎస్కార్ట్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి సత్యవతి రాథోడ్ గారు కార్యక్రమాలు ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు.

తాడ్వాయి సమీపంలో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఎస్కార్ట్‌ వాహనం స్వల్పంగా దెబ్బతింది. గన్‌మెన్లకు మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్ గారు గన్‌మెన్లతో స్వయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. బోలోరే వాహనదారుడు సైతం క్షేమంగా ప్రమాదం నుండి బయట పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version