2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నాం : మంత్రి సీతక్క

-

సరైన రహదారి సౌకర్యాలు లేక పోవడమే పల్లెల వెనక బాటుకి కారణం అని మంత్రి సీతక్క అన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి ఆవాసం నుంచి గ్రామపంచాయతీ.. అక్కడ నుంచి మండలానికి, జిల్లా కేంద్రానికి రహదారులు నిర్మిస్తున్నాం. 2,600 కోట్లతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నాం. రోడ్ల నిర్వాణ కోసం 1600 కోట్లు వెచ్చిస్తున్నాం. 30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల సామర్థ్యాన్ని మెరుగుపరచాలి. అనుగుణంగా రూరల్ ఇంజనీర్లు కార్యాచరణ సిద్ధం చేయాలి. కొత్త రహదారుల నిర్మాణ అంచనాలు పక్కాగా ఉండాలి. ఇష్టా రీతినా అంచనాలను సవరించొద్దు అని అధికారులకు సూచించారు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కాకతీయుల కాలం నాడు కట్టిన కట్టడాలు ఇంకా పటిష్టంగా ఉన్నాయి. అదే రీతిన రూరల్ ఇంజనీర్లు కట్టే నిర్మాణాలు 10 తరాలకు పనికిరావాలి. ప్రజలే మన బంధువులన్న విషయాన్ని గుర్తించి ఇంజనీర్లు పనిచేయాలి. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం. నాసిరకం పనులకు ఎన్ఓసిలిచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటాం . మహానగరాల్లో రోడ్లు మెరిసినట్టుగానే పల్లెల్లో రహదారులు మెరవాలి. ఆ బాధ్యత రూరల్ ఇంజనీరింగ్ విభాగానిదే అని మంత్రి సీతక్క స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version