చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే : జగన్

-

ఆరు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చింది అని మాజీ సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారు. చాలామంది శ్రేయోభిలాషులు వచ్చి.. చంద్రబాబులా హామీలు ఇవ్వాలని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం, విశ్వసనీయ ఉండాలి.. అలాంటి వారికే విలువ ఉంటుంది. మాట నిలబెట్టుకున్నామా.. లేదా అని చూస్తారు. హామీలు అమలు కాకపోతే.. ఆ నాయకుడి విలువ పోతుంది.

అందుకనే మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మేనిఫెస్టోను మనం అమలు చేశాం. బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడే ఏ నెల్లో ఏ క్యాలెండర్‌ అమలు చేస్తామో క్యాలెండర్‌ విడుదలచేశాం. చంద్రబాబును నమ్మడమంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే. పులినోట్లో తలకాయపెట్టడమే. ఇప్పుడు చంద్రబాబు పెడతానన్న బిర్యానీ పోయింది.. పెడుతున్న పలావూ పోయింది. చంద్రబాబుకూ, జగన్‌కూ మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. ఏ పథకమైనా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు డోర్‌డెలివరీ జరిగేది. మరి చంద్రబాబుకాలంలో ఎందుకు ఇలా జరగడంలేదు. కేవలం ముఖ్యమంత్రి మారడంతో ఇవి ఇప్పుడు జరగడంలేదు. ఇప్పుడు కూటమి నాయకులు ఏ ఇంటికీ వెళ్లలేరు, వారికీ ఆ ధైర్యంకూడా లేదు.. ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు అని జగన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version