Minister Sitakka : సావిత్రిబాయి ఫూలేను స్ఫూర్తిగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : మంత్రి సీతక్క

-

మహిళలు చదువుల తల్లి సావిత్రిబాయిపూలే ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని రాష్ట్ర పంచాయత్‌రాజ్‌ శాఖ మంత్రి సీతక్క(ధనసురి అనసూయ) అన్నారు. ఇండియాలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేసి మహిళల విద్యకోసం పోరాడిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయిపూలే అని కొనియాడారు. తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ,సావిత్రిబాయిఫూలే ఉమెన్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో సావిత్రిబాయిఫూలే 193వ జయంతి వేడుకలను రవీంద్రభారతీలో ఘనంగా నిర్వహించారు

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ ……సావిత్రిబాయిఫూలే స్ఫూర్తితోనే ఈ రోజుల్లో మహిళలు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. అలాంటి మహానీయురాలి జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అంతకుముందు ఆమె భాషా సాంస్కృతిక శాఖ వ్యవస్థాపకురాలు బెల్లం మాధవిలత, సంచాలకులు మామిడి హరికృష్ణ తో కలసి జ్యోతి ప్రజ్వలనం చేసి సావిత్రిబాయిపూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version