హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) టిక్కెట్ల గొడవపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లు బ్లాక్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అన్ని టికెట్లు ఆన్లైన్లో అమ్మాల్సిందేనన్న ఆయన.. స్టేడియం కెపాసిటీ ఎంత..? టికెట్లు ఎలా అమ్మారన్న విషయంపై ఆరా తీస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చితే సీఎం కేసీఆర్ సహించరని.. ఆ విధంగా ఎవరు ప్రవర్తించినా ఊరుకోమని స్పష్టం చేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్సీఏ వాళ్ళు స్టేడియం కట్టుకున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని శ్రీనివాస్ గౌడ్ సూచించారు. తెలంగాణలో అక్రమాలు సాగవని.. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. హెచ్సీఏపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినా.. మన పరువే పోతుందని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. హెచ్ సీఏ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. టికెట్ల అంశంపై క్రీడా సంస్థ, పోలీసుల నిఘా ఉందని చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.