సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రి తలసాని

-

ఈనెల 17, 18 తేదీల్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం లో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని ఆలయ కార్యనిర్వహణ అధికారి మనోహర్ రెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ సూరిటి కామేష్ ఆహ్వాన పత్రికను అందజేశారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బోనాల లో సందడి తగ్గింది.

ఈసారి బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాల కోసం 15 కోట్లు కేటాయించినట్లు చెబుతోంది. మొదట్లో కేవలం భక్తులకే పరిమితమైన బోనాల పండుగకు కొన్నేళ్లుగా రాజకీయపార్టీల హడావుడి కూడా తోడయింది. ఈ ఏడాది ఆషాడ మాసం బోనాలు జూన్ 30న ప్రారంభమయ్యాయి. జూలై 28 వరకు కొనసాగనున్నాయి.అయితే భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బోనాల ఉత్సవాలు ఆటంకం లేకుండా జరుగుతాయో లేదో వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version