అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. 2024 లో అందరికీ మంచి చేశాము.. 2025లో కూడా అలానే చేస్తాం అని అన్నారు. అయితే మేము చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేశాము అని ఉత్తమ్ పేర్కొన్నారు. అలాగే స్వతంత్ర భారతదేశంలో కులగనన చేయడం మొదటి సారి. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీరణ అమలు చేస్తాము. కొత్త రేషన్ కార్డులు, రేషన్ ద్వారా సన్న బియ్యం అందరికీ ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు మంత్రి.
అయితే 2025 ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ లో మేము.. తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగు వచ్చే విధంగా ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా కొత్త రేషన్ కార్డులు అందించే విధంగా ముందుకు వెళ్తాం. ఈ సాగులో రికార్డు స్థాయిలో ధాన్యం పండటం జరిగింది.. అంతే స్థాయిలో కొనుగోలు చేశాం. ఇక msp రేట్ కొనుగోలు చేసి సన్నలకు 500 బోనస్ కూడా ఇచ్చాము అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.