Minister Uttam Kumar Reddy : తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నల్గొండ జిల్లాలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ అడ్డుకున్నారు టెయిల్ పాండ్ నిర్వాసితులు. దీంతో మొహం చాటేసి పోలీస్ సెక్యూరిటీతో వెళ్లిపోయారట తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అడవి దేవులపల్లి మండలం చిట్యాల వద్ద ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని అడ్డుకున్నారు బాల్నేపల్లి చిట్యాల గ్రామస్తులు. టెయిల్ పాండ్ ప్రాజెక్టు నిర్వాసితుల కింద తమకు ఇల్లు నష్టపోయిన పరిహారం తదితర సమస్యలు నెరవేర్చకపోవడంతో అడ్డగించారు. తాగునీరు అందించడం లేదని ఇళ్లల్లోకి పాములు తేళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. దీంతో అక్కడి నుంచి సెక్యూరిటీ మధ్య తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లిపోయారని సమాచారం.