తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి వివాదంలో చిక్కుకున్నారు. సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశాఉ మంత్రి వాకిటి శ్రీహరి భార్య. మక్తల్ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు మంత్రి వాకిటి శ్రీహరి భార్య వాకిటి లలిత. అంతకు ముందు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వాకిటి లలిత… మంత్రి తరహాలోనే చెక్కులు పంపిణీ చేశారు.

దీనిపై బీఆర్ ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి భార్య ఎలా చెక్కులు పంపిణీ చేస్తారని నిప్పులు చెరిగారు.