కేసీఆర్ పాటలు పెట్టనివ్వలేదని.. బీఆర్ఎస్ జెండాలతో నిరసన తెలిపారు కొంత మంది యువకులు. వినాయక నిమజ్జనం సందర్భంగా.. ట్యాంక్‌బండ్ వద్ద కేసీఆర్ పాటల్ని ప్లే చేశారు యువత. అయితే… బీఆర్ఎస్ పాటలేంటి.. వాటిని ఆపాలంటూ అడ్డుకున్నారట పోలీసులు. దీంతో చిర్రెత్తుకొచ్చి.. బీఆర్ఎస్ జెండాలను ఊపుతూ తమదైన శైలిలో యువత నిరసన తెలిపారు.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తెలంగాణ సెక్రటేరియట్ ముందు కేసీఆర్ పాటలు పెట్టకుండా కర్రలతో పహారా కాస్తున్నారు పోలీసులు. అయితే… వినాయక నిమజ్జనం వచ్చిన ప్రతీసారి కేసీఆర్ పాటలు వేయడం…. చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా తెలంగాణ సచివాలయం ముందుకు రాగానే…. కేసీఆర్ పాటలు వేస్తూ స్టెప్పులు వేస్తున్నారు. కాగా… నిన్న రేవంత్ రెడ్డి పాటలు కూడా వేశారు.
తెలంగాణ సెక్రటేరియట్ ముందు కేసీఆర్ పాటలు పెట్టకుండా కర్రలతో పహారా కాస్తున్న పోలీసులు https://t.co/I7vaDG4RSi pic.twitter.com/25wMUxZPUI
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2025