బాల్‌కోట్ దాడుల పరంపరలో పాకిస్తాన్‌కు చెందిన యుద్ధవిమానాన్ని భారత వాయుసేన కూల్చివేసింది. ఆ ఘటనలో వింగ్ కమాండర్ పాక్‌కు పట్టుబడటం, తిరిగి వారు అప్పగించడం అన్ని తెలిసిందే. అయితే ఆ ఘటనను తాను చూసానని స్కాడ్రన్ లీడర్ ప్రకటించింది. వింగ్ కమాండర్‌కు వీరచక్ర అవార్డును భారత ప్రభుత్వం ఇచ్చింది. ఈ సందర్భంలో సంఘటన చూసిన స్క్వాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్ మాట్లాడుతూ.. అభినందన్ వర్ధమాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేయడం నా స్క్రీన్ నుంచి చూశాను.
ఆ సమయంలో ఆయనకు వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేస్తున్నాను. బాలాకోట్ స్థావరాలపై విజయవంతంగా దాడులు జరిపాం. శత్రువులను నుంచి ప్రతిస్పందన వస్తుందేమోనని భావించాం. అందుకు మేం సిద్ధంగా కూడా ఉన్నాం.అపాయం తలపెట్టే దురుద్దేశంతోనే పాక్ విమానం భారత గగన తలంలోకి ప్రవేశించింది. కానీ అప్పటికే మన పైలెట్లు, కంట్రోలర్లు, ఇతర బృందం నుంచి గట్టిపోటీ ఎదురయ్యే సరికి వారి మిషన్ విఫలమైంది అని తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మింటీకి యుద్ధ్ సేవా పతకాన్ని కేంద్రం ప్రకటించింది. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు గానూ ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డు పొందనున్న తొలిమహిళ రక్షణ అధికారి మింటీనే కావడం విశేషం.
– కేశవ