Mirai Moive Review: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ గా నటించిన సినిమా మిరాయ్. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. ఇందులో మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారు. సుమారు 60 కోట్లతో ఈ సినిమాను తీశారు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ మరియు వివరణ
మిరాయి మూవీ కథ విషయానికి వస్తే… కలింగ యుద్ధం తర్వాత అశోకుడు తన శక్తులను 9 గ్రంథాలలో దాచిపెడతాడు. ఇక ఆ గ్రంథాలను కాపాడే వాళ్ళు సపరేట్ గా ఉంటారు. కానీ వాళ్ల వివరాలు తెలుసుకొని బలవంతుడు కావాలన్నది మంచు మనోజ్ ప్లాన్. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ నువ్వు హీరో తేజ ఎలా ఆపుతాడు అన్నది? సినిమా కథ. విలన్ మంచు మనోజ్ ను హీరో తేజ ఎలా అడ్డుకుంటాడు ? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫైట్ సీన్స్ ఉంటాయి.. ఇందులో హీరోయిన్ రితిక పాత్ర ఏంటి ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలో హీరో తేజ సజ్జ వేదా పాత్రలో కనిపిస్తారు. సామాన్య యువకుడి నుంచి ధర్మరక్షకుడిగా ఈ సినిమాలో ఎదుగుతాడు తేజ. అటు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా డార్క్ మిస్టేక్ యోధుడి పాత్రలో… మంచు మనోజ్ కనిపిస్తారు. ఇక ఈ ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి. రాజమౌళి సినిమా రేంజ్ కంటే ఎక్కువగా తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను తీశారు. విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.
ప్లస్ పాయింట్స్
- అద్భుతమైన విజువల్స్ & VFX
- తేజ సజ్జా నటన
- విలన్ Manchu Manoj
మైనస్ పాయింట్స్
- మొదటి హాఫ్‌లో కథ సాగదీత
- క్విక్ కామెడీ
- పాత్రల పరిమితి
- నిరాశపరిచిన క్లైమాక్స్
Rating: 2.5/5