మిర్చికి రికార్డ్ ధర… ఎనుమాముల మార్కెట్ లో క్వింటాల్ కు రూ. 47500

-

మిర్చి రైతులకు సిరులు కురిపిస్తోంది. రికార్డ్ స్థాయిలో ధరలు పలుకుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది చాలా వరకు మిర్చికి అధిక ధర పలుకుతోంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి రైతులకు మంచి ధర పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ తో మిర్చికి డిమాండ్ ఉండటంతో ఆల్ టైం హై ధరలు వస్తున్నాయి. ఈసారి అకాల వాతావరణం వల్ల మిర్చి అనుకున్నంత దిగుబడి కూడా రాలేదు. దీంతో డిమాండ్ ఎక్కువగా ఉంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు ఎనుమాముల మార్కెట్ లో మిర్చికి హైఎస్ట్ రేట్ పలికింది. క్వింటాల్ దేశీ రకం మిర్చికి రూ. 47,500 రేటు పలికింది. సింగిల్ పట్టి మిర్చి రకానికి క్వింటాల్ కు రూ.41 వేలు ధర పలికింది. ఇటీవల కూడా క్వింటాల్ మిర్చికి రూ.48 వేలు ఆల్ టైం రికార్డ్ ధర పలికిన సంగతి మనకు తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది పత్తి రైతులకు కూడా రికార్డ్ ధరలు పెరిగాయి. సగటున క్వింటాల్ కు రూ.10 వేలకు పైగా పత్తికి ధర పలికింది. మద్దతు ధర కన్నా అధికంగా పత్తికి ధర పలకడంతో రైతులు ఎంతో కొంత లాభాలు ఆర్జించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version