కమల్ హాసన్, రజిని కాంత్‌లతో రాజమౌళి చిత్రం..?

-

వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు దర్శక ధీరుడు రాజమోళి. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా.. రాజమౌళి.. ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్నాడు. అయితే..త్వరలోనే ఎస్‌ఎస్‌ రాజమౌళి ఓ భారీ ప్రాజెక్టు చేపట్టబోతున్నారని టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సిని పరిశ్రమ లోనే అగ్ర నటులుగా వెలుగొందుతున్న రజీనీ కాంత్, కమల్ హాసన్ లతో ఓ సినిమా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

దీనిపై స్వయంగా రాజమౌళి ఓపెన్‌ అయ్యాడు. ఈ నెల 25 న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మూవీ ప్రమోషన్ల కోసం పలు మీడియా చానాళ్లకు రాజమౌళి ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.

ఈ క్రమంలో తన మనసులోని మాటను బయటపెట్టాడు జక్కన్న. అగ్ర హీరోలైన రజినీ, కమల్ లతో కలిసి సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఐతే దానికి సంబంధించి ఒక మంచి కథను కూడా తయారు చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని.. అందరూ వెయిట్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version