నాకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోవద్దంటూ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం మీడియాతో మాట్లాడిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావ్… దామరచర్ల మండలంలోని నర్సాపూర్ గ్రామస్థులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిపొందే వారిని హెచ్చరిస్తూ, అన్నం పెట్టే వారికి సున్నం” పెడుతున్నారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదని హుకుం జారి చేశారు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావ్. “నేను మర్యాదకే మర్యాద”..”నా సంగతి మీకు తెలియదు”…”అందర్నీ డ్యాన్స్ చేపిస్తా” అంటూ నర్సాపూర్ గ్రామస్థులనుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు ఎమ్మెల్యే భాస్కర్ రావు.