థియేటర్లకు వచ్చేస్తున్న.. ‘మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి’..

-

అనుష్క – నవీన్ పోలిశెట్టి ప్రధానమైన పాత్రలుగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ – ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా, కామెడీ ప్రధానమైన కథాంశంతో కొనసాగుతుంది. చాలా గ్యాప్ తరువాత అనుష్క చేసిన సినిమా కావడం వలన, ఆమె అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ‘కృష్ణాష్టమి’ సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నారు.

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్‌లో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో నవీన్ పొలిశెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక అనుష్క స్టార్ హీరోయిన్. అలాంటిది, వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి నెలకొంది. దీనికి తోడు యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేయనున్నట్టు ముందు ప్రకటించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version