తెలంగాణను అప్పుల పాలు చేశారు : కిషన్‌ రెడ్డి

-

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ భూములు అమ్మి ఆ డబ్బులతో వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనాలని చూస్తోందని ఆరోపించారు. కేసీఆర్ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు కిషన్ రెడ్డి. అనేక రాష్ట్రాలు తమ ఆదాయాన్ని పెంచుకుంటుంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని కిషన్ రెడ్డి విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు స్థలాలు లేవని చెబుతూనే వేలం పాటల ద్వారా రియల్ ఎస్టేట్ సంస్థలకు సర్కారు జాగాలను అమ్ముకుంటున్నదన్నారు కిషన్ రెడ్డి.

ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణానికి జాగా కావాలని కేంద్ర ప్రభుత్వం తానే స్వయంగా లేఖలు రాసినా రాష్ట్రప్రభుత్వం స్పందించలేదన్నారు. రైల్వే టెర్మినల్, చర్జపల్లి రైల్వే స్టేషన్ విస్తరణకు స్థలం అడిగితే లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు కోసం జాగా అడిగితే కేవలం అర ఎకరం మాత్రమే కేటాయించిందని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం వందల ఎకరాల జాగాలను అమ్మడాన్ని రోజు వారీ కార్యక్రమంగా అమలు చేస్తున్నదని ఆరోపించారు. కోకాపేట, బుద్వేల్, ఖాజాగూడ, మన్నెగూడ, ఆదిబట్ల లాంటి అనేక చోట్ల ప్రభుత్వ భూమిని ఈ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు వేలంలో అమ్ముతోందన్నారు. మూడు నెలల తర్వాత తమ ప్రభుత్వం ఉండదనే తెలిసే ఈ భూముల అమ్మకానికి శ్రీకారం చుట్టిందన్నారు. భూములు అమ్మడం పూర్తిగా అధికార దుర్వినియోగమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు జాగా లేదని చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకోసం సర్వే నంబర్ 503లో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version