ప్రపంచ సుందరీమణుల వేదిక… మిస్ వరల్డ్ పోటీలు రేపటి నుంచి హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి.. ఈ అద్భుతమైన వేడుకను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం మీ సొంతం కానుంది. తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేకంగా కాంప్లిమెంటరీ ఎంట్రీ పాస్‌లను అందిస్తోంది.
ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకునేవారు వెంటనే తెలంగాణ పర్యాటక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోండి: https://tourism.telangana.gov.in. ఎంపిక చేయబడిన వారికి నేరుగా మెయిల్ ద్వారా ఆహ్వాన సందేశాలు పంపబడతాయి. అందమైన ప్రపంచాన్ని మీ కళ్లారా చూడటానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఆలస్యం చేయకండి… వెంటనే మీ పేరు నమోదు చేసుకోండి..!