పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా “హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” షూటింగ్ పూర్తయింది. ఈ వార్తను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్, మే 5, 2025న తన చివరి రెండు రోజుల షూటింగ్‌లో పాల్గొని తన పాత్రను పూర్తి చేశారు. ఈ సినిమా ప్రారంభం అయిన 2020 నుంచి అనేక అడ్డంకులను ఎదుర్కొంది. కరోనా వైరస్ ప్రభావంతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల కారణంగా షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది.
అయితే, డిప్యూటీ సీఎం అయిన తరువాత కూడా అభిమానుల కోసం ఆయన సినిమా కోసం సమయం కేటాయించడం గమనార్హం. విజయవాడ, హైదరాబాద్, ముంబై లాంటి కీలక ప్రదేశాల్లో షూటింగ్ చివరి షెడ్యూల్ జరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం, “ఇది ఒక భారీ ప్రయాణం. ఇప్పుడు అది విజయవంతంగా ముగిసింది. త్వరలోనే ట్రైలర్ , పాటలతో మీ ముందుకు వస్తాం,” అంటూ తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసింది. ఈ ప్రకటన పవన్ అభిమానుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.