పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాత్రంతా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపినట్లు సమాచారం. దీనికి తోడు ఎక్కడ పూర్తి స్థాయిలో యుద్ధం వస్తుందో అని ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
దీంతో ఇంటి నుండి బయటకు రావాలంటేనే అక్కడి ప్రజలు భయపడుతున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఏటీఎం సెంటర్లు, మార్కెట్లు, నిత్యావరసర సరుకుల దుకాణాల్లో పెద్దఎత్తున ప్రజలు చేరుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ధరలు ఆకాశాన్ని అంటాయి.ఇదిలాఉండగా, నిన్న రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన మిసైల్ అటాక్స్ కు భయపడి పాకిస్తాన్ ఉగ్రవాదులు
ప్రాణ భయంతో పరుగులు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పరుగులు తీస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు.
ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల పై విరుచుకుపడుతున్న భారత సైన్యం pic.twitter.com/il1pQzevyH
— Journalist Vijaya Reddy (@VijayaReddy_R) May 7, 2025