ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆదేశాలు పంపించినట్లు సమాచారం.
మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్‌గా అన్ని రాష్ట్రాల సీఎంలు, సీఎస్, డీజీపీలతో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. యద్ధ వాతావరణం నేపథ్యంలో అమిత్ షా సీఎంలకు, రాష్ట్రాల అధికారులకు భద్రత విషయంలో పలు సూచనలు చేసే అవకాశం ఉంది. మరోవైపు తదుపరి తాము తీసుకునే నిర్ణయాలు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి కూడా వారితో అమిత్ షా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.