అసెంబ్లీలో నేడు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తాజాగా స్పందించారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరేం చేశారో.. 15 నెలల కాంగ్రెస్ పాలనలో మేము ఏం చేశామో చర్చకు సిద్ధం.
ఈరోజు కాంగ్రెస్ హామీలు, గ్యారెంటీలపై మాట్లాడుతున్న కేటీఆర్‌ను సూటిగా ఒకటే అడుగుతున్నాను.దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు.దీనికి ఒక్క రూపాయి ఖర్చు లేదు. అలాంటప్పుడు మరి ఎందుకు చేయలేదు? అని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు.