మ‌రో రికార్డు క్రియేట్ చేసిన మిథాలీ రాజ్‌.. 7వేల వ‌న్డే ర‌న్స్ పూర్తి చేసిన మొద‌టి మ‌హిళా క్రికెట‌ర్‌..

-

భార‌త మ‌హిళా వ‌న్డే జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మ‌రో చారిత్రాత్మ‌క మైలురాయికి చేరుకుంది. వ‌న్డేల‌లో 7వేల ప‌రుగులు చేసిన తొలి మ‌హిళా క్రికెట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. ఆదివారం ల‌క్నోలో సౌతాఫ్రికా మ‌హిళ‌ల జ‌ట్టుతో జరిగిన 3వ వన్డే మ్యాచ్‌లో ఆమె ఈ ఘ‌న‌త సాధించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆమె ఖాతాలో 6,974 వ‌న్డే ప‌రుగులు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె మ్యాచ్‌లో మ‌రో 26 ప‌రుగులు చేసి ఈ ఘ‌న‌త సాధించింది. ఆమెకు ఇది 213వ వ‌న్డే కావ‌డం విశేషం.

కాగా మ్యాచ్‌లో మిథాలి రాజ్ 71 బంతుల్లో 45 ప‌రుగులు చేసి అర్ధ సెంచ‌రీ చేయ‌కుండానే ఔట్ అయింది. త‌న ఇన్నింగ్స్‌లో ఆమె 4 ఫోర్లు కొట్టింది. ఇక మ్యాచ్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 266 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా జ‌ట్టు బ్యాటింగ్ కొన‌సాగుతోంది. ఆ జ‌ట్టు 26.2 ఓవ‌ర్ల‌లో 1 వికెట్ న‌ష్టానికి 128 ప‌రుగుల స్కోరు వ‌ద్ద కొన‌సాగుతోంది.

ఇక 10వేల అంత‌ర్జాతీయ ప‌రుగుల‌ను పూర్తి చేసుకున్న తొలి ఇండియా వుమ‌న్ క్రికెట‌ర్‌గా కూడా మిథాలీ పేరుగాంచింది. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే ఆ ఫీట్ సాధించిన రెండో క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. వ‌న్డేలు కాకుండా 10 టెస్టుల‌లో ఆమె 663 ప‌రుగులు చేయ‌గా ఆమె స‌గ‌టు 51గా ఉంది. అలాగే టీ20ల‌లో ఆమె 89 మ్యాచ్‌ల‌లో 37.52 స‌గ‌టుతో 2364 ప‌రుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version