బాలయ్యకు అవమానం… జగన్ కావాలనే చేస్తున్నారా…?

-

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే లేపాక్షి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రాధాన్యత కల్పించలేదు అనే ఆరోపణలు వినపడుతున్నాయి. దీనిపై ఇప్పుడు టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడితే పార్టీలను పక్కన పెట్టి ప్రొటోకాల్‌ పాటిస్తారని అయితే లేపాక్షిలో నిర్వహించే ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటో ఎక్కడా కనిపించడం లేదని టీడీపీ ఆవేదన వ్యక్తం చేస్తుంది.

ఆయనకు అసలు ఈ ఉత్సవాల్లో ప్రాధాన్యత ఏ మాత్రం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేవలం ఉత్సవాల ఆహ్వాన పత్రికలో పేరు తప్ప, సభావేదిక, ఆహ్వాన తోరణాలు, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఫొటో కనిపించడం లేదట. ఈ విషయాన్ని టీడీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. దీనిపై టీడీపీ గతం మాట్లాడుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో లేపాక్షి ఉత్సవాలు నిర్వహించిన సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చే వారని అంటుంది.

కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతుంది. ఇక నియోజకవర్గంలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నా వైసీపీ నేతలే ఎక్కువగా పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ ఉత్సవాల్లో కూడా బాలయ్యకు ప్రాధాన్యత తగ్గిందని అంటున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో బాలకృష్ణ లేపాక్షిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు దానికి మరింత ప్రాచుర్యం పొందేలా చేయడంతో పాటుగా ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించే వారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version