జనరిక్ మందుల లబ్ది దారులు ప్రధాని నరేంద్ర మోడీని పొగడ్తల్లో ముంచెత్తారు. కరోనా వైరస్ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి పలు కీలక సూచనలు చేసారు. జనరిక్ మందుల షాపు ల యజమానులు, జనరిక్ మందులు వాడకం దారులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.
కరోనా వైరస్ గురించి పుకార్లు నమ్మవద్దని, వైద్యులు సూచించినట్లు గా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని ప్రజలను కోరారు. కరచాలనం బదులుగా మన భారతీయ సంస్కృతి లో నమస్కారం చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రపంచం మొత్తం నమస్తే చేయటం అలవరుచుకుంటారని అన్నారు. దీనిలో భాగంగా ఆ మందులు వాడటం వల్ల లాభపడిన దీపా షా మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి లోనయ్యారు.
జనరిక్ వల్ల తనకు మందులకు అయ్యే ఖర్చు తగ్గినందు వల్ల కడుపు నిండా తిన గలుగు తున్నానని ,డబ్బులు ఆదా చేసుకో గలిగానని , ప్రధాని ముందు కన్నీటి పర్యంతమయ్యారు. అది చూసి ప్రధాని కొన్ని క్షణాల పాటు భావోద్వేగానికి లోనయ్యారు. తాను ప్రధాని మోదీ గారి రూపం లో ఈశ్వరుడిని చూశానని కొనియాడింది. జనరిక్ మందుల వల్ల సామాన్య ప్రజలకు ఎంతో లాభం చేకూరుతందని ఆమె అన్నారు.