నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేసీఆర్‌ది ఫైటర్స్ ఫ్యామిలీ అయితే.. అరవింద్ ది చీటర్స్ ఫ్యామిలీ అంటూ విమర్శించారు. ఎంపీ అరవింద్ అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాజని మండిపడ్డారు. అరవింద్ ఒక దొంగ అని నిప్పులు చెరిగారు. బడికి పోయే వయసులో బార్ షాపుల చుట్టూ తిరిగిన అరవింద్ కు సంస్కారం ఎక్కడ్నుంచి వస్తదని ధ్వజమెత్తారు.
అరవింద్‌ను ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్‌గా వర్ణించారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. “అరవింద్ రాజస్థాన్‌లో చదువు ఒక ఫేక్. పసుపు బోర్డు తెస్తానని రాసిచ్చిన బాండ్ పేపర్ ఫాల్స్. ఆయన చెప్పే మాటలు ఫ్రాడ్” అని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే అరవింద్ బూతు పురాణాలకు దిగాడని మండిపడ్డారు.
మల్లికార్జున్ ఖర్గేతో కవిత మాట్లాడారని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే మండిపడ్డారు. అరవింద్ ఎంపీగా ఈ నాలుగేళ్లలో ఏం చేశాడో, ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తీసుకురానందుకు రైతుల కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని అన్నారు.