గుజరాత్‌లో మోదీ.. ప్రతి బూత్‌లో బీజేపీనే గెలిపించాలని విజ్ఞప్తి

-

గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీని గెలిపించడానికి ఓవైపు ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. మరోవైపు ఆప్ ను గెలిపించాలని దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కంకణం కట్టుకున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ కు ఓ ఛాన్స్ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ రేపటి నుంచి ప్రచారం చేయనున్నారు.

గుజరాత్ లో ఎలాగైనా మళ్లీ పాగా వేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోదీ స్వరాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. గిర్‌ సోమ్‌నాథ్‌ జిల్లాలో పర్యటించిన ఆయన.. ప్రతి పోలింగ్‌ బూత్‌లోనూ బీజేపీనే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

‘ప్రతి బూత్‌లోనూ బీజేపీ గెలవాలి. నా కోసం ఇది చేస్తారా..? ఈసారి అన్ని పోలింగ్‌ బూత్‌లలో గెలవడంపైనా దృష్టి పెట్టాను. ఈ విషయంలో మీరు సహకరిస్తే.. ఈ జిల్లాలోని నలుగురు బీజేపీ నేతలు అసెంబ్లీకి చేరతారు’ అని గిర్‌ సోమ్‌నాథ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version