టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేడు ఒక సమావేశం లో మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రైతుల కళ్లలో ఏరువాక పండుగ కనబడటం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. నిరాశ, నిస్పృహ, నిర్వేదం కనిపిస్తున్నాయన్నారు నిమ్మల రామా నాయుడు. ఖరీఫ్ కాలం కు ఏరువాకతో పంటను ప్రారంభించాల్సిన రైతులు.. ధాన్యం అమ్ముకోలేక మిల్లుల దగ్గరే పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నిమ్మల. ధాన్యం అమ్మాలంటే రైతులే మిల్లులకు ఎదురు డబ్బులు కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు ఆయన.
కష్టాల్లో ఉన్న అన్నదాతలను కూడా దోచుకుంటున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బస్తాకు 10 కిలోల ధాన్యం చొప్పున అదనంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే నిమ్మల రామ నాయుడు. అన్నదాత భరోసా కేంద్రాలు.. రైతు దగా కేంద్రాలుగా మారాయన్నారు ఆయన . ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం ఇస్తానన్న చంద్రబాబుతోనే ఏపీలో రైతు రాజ్యం సాధ్యమని వెల్లడించారు ఎమ్మెల్యే నిమ్మల.