చంద్రబాబు విజన్ తోనే ఎస్సీల అభివృద్ధి జరిగింది అని ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. అంబెడ్కర్ రాజ్యాంగం లో చెప్పిన అంశాన్ని చంద్రబాబు అమలు చేశారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఎస్సి వర్గికరణ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2011 జనాభా ప్రాతిపదికన ఏ బి సి కేటగిరీ గా విభజన జరిగింది. 59 కులాలుగా ఉన్న ఎస్సి లు వర్గికరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని పేర్కొన్నారు.
అయితే ఏ బి సి కేటగిరీలుగా వర్గీకరిస్తూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలని మిశ్రా కమిటీ నివేదిక ఇచ్చింది. 2011 జనాభా ప్రాతిపదికన విభజన జరుగుతుంది. రెల్లి కులస్తులకు 1 శాతం.. మాల అనుబంధ కులాలకు 7.5 శాతం.. మాదిగ అనుబంధ కులాలకు 6.5 శాతం గా మిశ్రా కమిషన్ సూచించింది. ఎస్సీ కమిషన్ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోమని సూచించింది. జిల్లా యూనిట్ గా తీసుకోవాలని మేం కోరుతున్నాం అని రామాంజనేయులు పేర్కొన్నారు.