నిమజ్జనంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త ఝాన్సీ రెడ్డి డాన్స్

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి ఇద్దరూ రచ్చ చేశారు. వినాయక నిమజ్జనం తమ నియోజకవర్గం పాలకుర్తిలో జరుగుతున్న నేపథ్యంలో.. ఆ వేడుకల్లో పాల్గొన్నారు.

MLA Yashaswini Reddy's aunt Jhansi Reddy dances during the immersion of Lord Ganesha
MLA Yashaswini Reddy’s aunt Jhansi Reddy dances during the immersion of Lord Ganesha

ఈ సందర్భంగా… పాలకుర్తి లేడీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అలాగే ఆమె అత్తమ్మ ఝాన్సీ రెడ్డి ఇద్దరు కూడా స్టెప్పులు వేశారు. ఊర మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అటు హైద‌రాబాద్ లో గణపతుల నిమజ్జనం నేపథ్యంలో 30 వేల మంది పోలీసులతో హైదరాబాదులో భారీ ఏర్పాట్లు జరిగాయి. అయితే.. నిమజ్జనం వచ్చిన ప్రతిసారి… కెసిఆర్ పాటలు ట్యాంక్ బండ్ వేదికగా హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సెక్రటేరియట్ ముందు నుంచి గణపతి వెళ్ళినప్పుడు.. గులాబీల జెండాలమ్మా అంటూ కెసిఆర్ పార్టీకి సంబంధించిన పాటలు వేసి రచ్చ చేస్తున్నారు యూత్.

Read more RELATED
Recommended to you

Latest news