విదేశాలకు వెళ్లిన హరీష్ రావు… ఇవాళ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలవబోతున్నారు. ఎర్రవెల్లి లోని ఫార్మ్ హౌజ్ లో ప్రస్తుతం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడే కేటీఆర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. మరికాసేపట్లోనే కేసీఆర్ తో కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ పై కీలకంగా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం పూర్తయిన తర్వాత హరీష్ రావు మీడియాను అడ్రస్ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇక కవితపై ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపైన ఈ సమావేశం అనంతరం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.