ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ తాజాగా కీలక కామెంట్స్ చేసారు. ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కాంట్రాక్టు ఉద్యోగులకు అండగా ఉంటాను. ఎన్నికల కోసం అబద్ధపు హామీలు ఇచ్చే నాయకులను నమ్మవద్దు అని పేర్కొన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది. అయితే అర్హత కలిగిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగులుగా తీసుకోవాలి అని సూచించారు.
అలాగే గ్రాడ్యుయేట్స్ కు తగిన గౌరవం ఇవ్వాలి. వారి ఉద్యోగాలు వారికి తిరిగి ఇవ్వాలి. రైతులను దృష్టిలో పెట్టుకుని గ్రాడ్యుయేట్స్ కు న్యాయం చేయాలి. అదే విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్ముతున్నాను. పోలీసు శాఖలో ప్రవేశానికి జరిగిన పరీక్షల ప్రశ్న పత్రాలలో జరిగిన తప్పులను సవరించాలి అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపునకు దగ్గరగా ఉన్నాం. ప్రజల తరఫున పోరాడే వ్యక్తిని ఎన్నుకోవాలని ప్రజలకు తెలుసు అంటూ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్కొన్నారు.