మొదట్నుంచీ బీఆర్ఎస్ పార్టీ మహిళల పట్ల వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఫస్ట్ కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా అవకాశం కల్పించలేదన్నారు. రిజర్వేషన్ ప్రాతిపదికన మహిళలకు అవకాశం వచ్చినా.. స్థానిక ఎమ్మెల్యేల పెద్దరికం పెరిగిపోయిందని విమర్శించారు జీవన్ రెడ్డి. నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టవద్దనే నిబంధన ఉన్నా… మూడేళ్లకే ఎందుకు అవిశ్వాస ప్రతిపాదన తెచ్చారని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. అమాయకపు మహిళల మీద ఒత్తిళ్లెందుకన్న ఆయన ఆడబిడ్డలు కంటతడి పెట్టడం ప్రభుత్వానికి శాపంగా మారుతుందన్నారు జీవన్ రెడ్డి.
పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటనపై జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకేంటన్నారు. పవన్ సిద్ధాంతం ఏంటో, ఆయన ఆలోచన విధానమేంటో ఇప్పటికీ అర్ధంకావడం లేదన్నారు. ఆయన భావస్వరూప్యం గురించి తమకు తెలియదన్నారు. బీఆర్ఎస్ ను వాళ్లకు వాళ్లే జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని విమర్శించారు.