కస్టమర్లకు అలెర్ట్..రేపటి నుంచి ఐదు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే?

-

ముఖ్యమైన లావాదేవీలు చెయ్యాలంటే ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్ళాలి..అలాంటివి ఉన్నప్పుడు బ్యాంకు సెలవుల గురించి కూడా తప్పక తెలుసుకోవాలి.. ఎందుకంటే బ్యాంకులు ఏ రోజు తెరచి ఉంటాయో.. ఏ రోజు మూసి ఉంటాయో తెలియకుండా వెళితే సమయం వృధా కావడంతో పాటు కొంత ఆర్థిక నష్టం కూడా సంభవిస్తుంటుంది. ప్రతి నెల బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది ఆర్బీఐ. ఈ విషయాలను తెలుసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులను నివారించేందుకు ముందస్తు ప్లాన్‌ చేసుకోవడం బెస్ట్..

 

యాజమాన్యాలు హామీ ఇచ్చినా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌లపై సానుకూల చర్యలు తీసుకోనందుకు యుఎఫ్‌బియు జనవరి 30 నుంచి 31 తేదీల్లో అఖిల భారత బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చినట్లు సమాచారం.. బ్యాంకు ఉద్యోగుల ఆరు అంశాల డిమాండ్లపై ఈ సమ్మె జరగనుంది. జనవరి 26 నుంచి 31 మధ్య, బ్యాంకులు జనవరి 27న కేవలం ఒక రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. బ్యాంకు ఖాతాదారులు తమ ముఖ్యమైన పనిని జనవరి చివరి వారంలోపు పూర్తి చేయాలి.. లేదంటే మాత్రం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది..

ఇక బ్యాంకు సెలవుల విషయానికొస్తే..జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు, 27న ఓపెన్‌ ఉంటాయి. 28న నాలుగో శనివారం, తర్వాత 29న ఆదివారం బ్యాంకులకు సెలవు. ఇక జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకుల సమ్మె ఉంది. 27వ తేదీ తర్వాత వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వాణిజ్య బ్యాంకుల్లో పనిచేస్తున్న మొత్తం తొమ్మిది మంది అధికారులు యుఎఫ్‌బియు పిలుపు మేరకు స్టేట్ బ్యాంక్‌తో పాటు అన్ని ఇతర బ్యాంకర్లు సమ్మెలో పాల్గొంటారు..అయితే వారి డిమాండ్లపై గురువారం ముంబైలో జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ సమ్మె చేస్తున్నట్లు వారు తెలిపారు.. వారి డిమాండ్ లను నెరవేర్చకుంటే సమ్మెను పొడిగించనున్నట్లు పేర్కొన్నారు..అందుకే ఏదైనా ముఖ్యమైన బ్యాంక్ పని ఉంటే ఇప్పుడే చేసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Exit mobile version