కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీతో ముగిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి భేటీ

-

తెలంగాణ భవన్ శబరి బ్లాక్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశం ముగిసింది.ఇక ఈ సమావేశ అనంతరం బయటకు వచ్చిన దీపదాస్ మున్షీని మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఎవరు అసంతృప్తిగా లేరని, ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పనంటూ సమాధానం ఇచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా నిరాకరించారు. తర్వాత మాట్లాడతా అంటూ వెళ్లిపోయారు. ఈ సమావేశంలో ఏం మాట్లాడారనే దానిపై స్పష్టత లేదు.

కాగా, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కాంగ్రెస్ నాయకత్వంపై జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీలో దీపాదాస్ మున్షీతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version