గుజరాత్‌లో రేపిస్టులు విడుదలపై సీజేఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

-

ఇటీవల గుజరాత్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను ఆ రాష్ట్ర ప్రభుత్వం  విడుదల చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ‘2002 నాటి బిల్కిస్ బానో అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేసిన విషయంలో బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రూపొందించిన 1992 విధానం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం వారిని రిమిషన్‌కి అనర్హులుగా ప్రకటించవచ్చు.

రేప్ వంటి నేరాలు మన సామాజిక స్పృహను కుదిపేస్తాయి. శిక్ష పడిన రేపిస్టులు స్వతంత్ర దినోత్సవం నాడు బయటికి రావడంతో ప్రతీ పౌరుడుకు వెన్నులో వణుకు పుడుతోంది’ అని పేర్కొన్నారు కల్వకుంట్ల కవిత. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేసిందని, సీబీఐ ప్రత్యేక కోర్టు వారికి శిక్ష విధించిందని గుర్తు చేశారు కల్వకుంట్ల కవిత. సీబీఐ దర్యాప్తు చేసిన కేసుల్లో దోషుల శిక్షను తగ్గించడం లేదా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అలాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీఆర్పీసీ సెక్షన్ 435(1)(ఏ) చెబుతుందని ప్రస్తావించారు కల్వకుంట్ల కవిత. ఈ కేసులో 11 మంది దోషుల విడుదలకు కేంద్ర ప్రభుత్వంతో గుజరాత్ ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందో లేదో స్పష్టత లేదని తెలిపారు కల్వకుంట్ల కవిత.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version