మంత్రి కేటీఆర్ ప్రమాదంపై స్పందించిన కవితక్క !

-

తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీ ప్రచారాలను వేగవంతం చేస్తున్నాయి. ఏ విధంగా అయినా అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి BRS, కాంగ్రెస్ మరియు బీజేపీ లు. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ నిజామాబాదు జిల్లా ఆర్మురు ప్రచారం ర్యాలీలో ఉండగా ప్రచార రథంపై నుండి ముందుకు పడబోయి చాలా ప్రమాదం తప్పింది. సడెన్ గా డ్రైవర్ బ్రేక వేయడంతో ఈ అనుకోని ప్రమాదం జరిగింది. ఆ తరువాత కేటీఆర్ స్వయంగా నేను బాగున్నానని.. నా ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దని ప్రజలకు తెలియచేశాడు. ప్రమాదం జరిగినా కానీ, ప్రచారాన్ని ఆపకుండా అక్కడి నుండి కొడంగల్ పర్యటనకు వెళ్లడం ఆశ్చర్యకరం అని చెప్పాలి.

ఇక ఈ ప్రమాదంపై కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రమాదం గురించి కేటీఆర్ తో మాట్లాడతానని కామెంట్ చేశారు, దీనితో పాటుగా టేక్ కేర్ రామన్న అన్న వాఖ్యాన్ని ఆడ్ చేశారు కవిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version