బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు : రేవంత్ రెడ్డి

-

నేడు పొంగులేటి నిన్న తుమ్మల అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతలు దేనికి సంకేతం అని ప్రశ్నించారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. బిజెపి టిఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐపిఎల్ ఎందుకు జరగడంలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతుందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ కేడి బెంబేలెత్తుతున్నారన్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తున్న కుతంత్రం ఇది. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కారు, కమలం గల్లంతవ్వడం ఖాయమన్నారు రేవంత్ రెడ్డి.


పాలకుర్తి ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉంది. మిమ్మల్ని చూస్తుంటే దొరల గడియలు కొట్టడం అనిపిస్తుంది. మీకు సేవ చేసేందుకు కళాశాలలు కోసం 80 ఎకరాల భూమి కొంటె.. ఎర్రబెల్లి దయాకర్ రావు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాడు. మన ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం రాకుండా అడ్డుకున్నాడు. శత్రువులతో చేతులు కలిపి కుట్రలు చేసి నన్ను జైలుకు పంపిండు. కాంగ్రెస్ కార్యకర్తలపై దయాకర్ రావు పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలం పోటుతో తొలగిస్తాం అన్నారు. ఎన్నికల్లో పాలకుర్తిలో ఈ దొర పాలన.. తెలంగాణలో ఆ దొర పాలన అంతం కావడం ఖాయమని స్పస్టం చేశారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version