జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు అంటూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చింది, ఎక్కువ రోజులు మీ వైఖరి ఉండదని ప్రజలు తిరగబడతారని ఆమె చెప్పారు జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ సర్పంచ్ ని జగిత్యాల జైల్లో కవిత పరామర్శించారు తర్వాత ఆమె మాట్లాడుతూ హబ్సిపూర్ సర్పంచ్ పై కక్షపూరితంగా వ్యవహరించి జీవన్ రెడ్డి కేసు పెట్టించారని ఫైర్ అయ్యారు. జగిత్యాలలో 30 ఏళ్లు జరగని అభివృద్ధి ఎమ్మెల్యే సంజయ్ చేశారని ఆమె గుర్తు చేశారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక మా నాయకులు మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని జీవన్ రెడ్డి పై కవిత ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ రాజ్యమేనా అని అడిగారు ఆమె. ప్రజలు తిరగబడతారు జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజులు ఉండదని ఆమె మండిపడ్డారు. అమలు కానీ హామీలని ఇచ్చారు మొదట హామీలని అమలుపరచండి అని ఆమె అన్నారు