విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి:ఎమ్మెల్సీ కవిత

-

బోధన్ లో ప్రభుత్వ బీసీ హాస్టల్ లో ఉంటూ మరణించిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఆ కుటుంబం లో ఒకరికి అర్హతలకి తగిన ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాంధారి మండలం తిప్పారం తండా కి చెందిన హరియాల వెంకట్రాం ప్రభుత్వ హాస్సుల్లో ఉంటూ చనిపోవడంతో కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్సీ కవిత బుధవారం పరామర్శించారు.

ఫ్యామిలీ మెంబర్లని ఓదార్చారు. అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అలానే ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ప్రభుత్వ హాస్టల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version