చట్టసభల్లో మహిళా బిల్లు కోసం కాంగ్రెస్ పోరాడితే మద్దతిస్తాం: MLC కవిత

-

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కాంగ్రెస్‌ పోరాడితే మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ పోరాటంలో అన్ని పార్టీలు పాలు పంచుకోవాలని కోరారు. ఏళ్ల తరబడి పోరాడుతున్నా.. ఈ బిల్లు అంశం ఇంచు కూడా కడల్లేదని అన్నారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై దిల్లీలోని లే మెరిడియన్ హోటల్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే, వామపక్షాలు, శివసేన, ఆప్‌ సహా 13 విపక్ష పార్టీల ఎంపీలు, ప్రజా సంఘాల నాయకులు హాజరై… తమ అభిప్రాయాలు తెలియజేశారు.

ఇటీవల జంతర్ మంతర్ వద్ద దీక్షకు కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత… పార్లమెంటులో ప్రైవేటు మెంబర్‌ బిల్లులు పెట్టి… కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే తమ లక్ష్యమని కవిత మరోసారి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version